1.ఆర్ధిక సమాచారము ఇవ్వండి :
భారతీయులకు సంబంధించిన ఆర్థిక సమాచారాన్ని అందించాలంటూ ఆదాయపు పన్ను శాఖ వివిధ దేశాలకు 200 అభ్యర్థనలు పంపించింది. ఇది పనామా పత్రాల నేపథ్యంలో ఈ ఆదేశం జారీ అయింది . అభ్యర్థనలు అందుకున్న దేశాల్లో అమెరికా, యూకే, సింగపూర్, స్విట్జర్లాండ్, యూఏఈ వంటివి ఉన్నాయి.
చైనాలోని హాంగ్‌ఝౌలో జరిగిన జి-20 శిఖరాగ్ర సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు . దానిలో భాగంగా ఆయన మాట్లాడుతూ భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు.
‘స్వచ్ఛభారత్’ కార్యక్రమ ప్రచారకర్తలుగా రియో ఒలింపిక్స్‌లో సత్తాచాటిన పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్‌లు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. వారి విజయాల్లో శుభ్రత, ఆరోగ్యం పాత్రపై కథనాలు ఈ కార్యక్రమానికి ఎంతో మేలుచేస్తాయి’’ అని తాగునీరు, శుభ్రత విభాగం కార్యదర్శి పరమేశ్వరన్ తెలిపారు.
నోట్ 7 ఫోన్ల బ్యాటరీలు పేలిపోయినట్లు కొన్ని ఫిర్యాదులు రావడంతో ప్రపంచవ్యాప్తంగా 2.5 మిలియన్ల ఫోన్లను సామ్‌సంగ్ వెనక్కి పిలిచింది.ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో దిగ్గజ సంస్థగా పేరొందిన సామ్‌సంగ్‌కు గెలాక్సీ నోట్ 7 తో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అయితే నోట్ 7 వల్ల సామ్‌సంగ్‌కు బిలియన్ డాలర్ల భారం పడనున్నట్లు సమాచారం.
విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మరో ఆఫర్‌తో ముందుకొచ్చింది. ముందస్తు బుకింగ్‌లపై అన్ని ఛార్జీలు కలిపి రూ. 599 ప్రారంభ ధరతో విమాన టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 11 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. 2017, ఫిబ్రవరి 6 నుంచి 2017 అక్టోబర్ 28 మధ్య ఎయిర్‌ఏషియా దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
6. రేపటి నుంచి జీఎస్‌ఎల్‌వీ కౌంట్‌డౌన్:
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి గురువారం నింగిలోనికి పంపనున్న జియోసింక్రనస్ లాంచ్ వెహికల్(జీఎస్‌ఎల్‌వీ) ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ బుధవారం ఉదయం 11.10గంటలకు ప్రారంభంకానుంది. దీని ద్వారా ఇన్‌షాట్-3డీఆర్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఉపగ్రహం పూర్తిగా వాతావరణ పరిశోధనకు సంబంధించినది.
7.తాజ్ సమీపంలో విమానాశ్రయం:
ఇప్పటివరకు తాజ్‌మహల్ అందాలను వీక్షించేందుకు రోడ్డు.. రైలు మార్గాలనే పర్యాటకులు ఆశ్రయించారు. ఇక నుంచి విమాన సదుపాయాన్ని కల్పించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజ్‌మహల్ సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది.
8. సెయింట్ మదర్ థెరిసా:
కరుణామయి.. విశ్వమాత.. అభాగ్యులు, అనాథల పాలిట అమృత హస్తం.. మదర్ థెరిసా ‘పునీత’ (సెయింట్) అయ్యారు. రోమన్ క్యాథలికుల్లో అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరం లాంటి ఈ హోదాను ఆమెకు ఇస్తున్నట్లు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన చేశారు. ఆదివారం వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో కన్నులపండువగా జరిగిన ‘క్యాననైజేషన్’కార్యక్రమానికి దాదాపు లక్ష మంది హాజరయ్యారు. భారత్ నుంచి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, దిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, కేంద్ర ఆహార శుద్ధి శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, వివిధ రాష్ట్రాల ఉపముఖ్యమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.

ConversionConversion EmoticonEmoticon