హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ
భారతదేశంలోని దేశీయా రాజుల పరిపాలనలో ఉన్న సంస్థానాలన్నింటిలోను హైదరాబాద్ సంస్థానం చాలా పెద్దది .
దీని వైశాల్యం 82,698 చ. మైళ్లు . ఇందులో తెలంగాణ భూ భాగం 41,502 చ. మైళ్లు.
బ్రిటిష్ ఇండియాలోని ఏ సంస్థానానికి లేని అధికారాలు,సదుపాయాలు ఈ స్టేటుకు ఉండేవి. స్వతంత్ర కరెన్సీ (హాలీ రూపాయలు అనేవారు -అప్పటి కరెన్సీని )తంతి ,తపాలా ,రైల్వే శాఖలు కూడా ఈ ప్రభుత్వం ఆధీనంలో ఉండేవి.
హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న అత్రాఫ్ బల్ద జిల్లా మొత్తం ఆదాయం నిజాం స్వంత ఖర్చులకు తీసుకునేవారు . దీనిని "సర్ఫెఖాస్ "అనేవారు . ఇది కాక ఆయనకు వివిధ జిల్లాలలో ఇంకా కొన్ని సర్ఫెఖాస్ జాగీర్ గ్రామాలు కూడా ఉండేవి.
సంస్థానమంతటా చిన్నా,పెద్ద కలిపి దాదాపు 11 వందల మంది జాగీర్ధార్లు ,సంస్థానాధిపతులు ,దేశముఖ్ ,దేశ్ పాండ్యాలు ఉండేవారు. ఈ జాగీర్ధార్లలో చాలా మంది హైదరాబాద్ నగరంలో విలాస జీవితం గడుపుతూ
కలక్షే పం చేసేవారు . వీరంతా తమ జాగీర్లలోసర్వాధికారులు. వీరి తరపున వారి ఉద్యోగ బృదం గ్రామాలలో నిరంకుశధికారం చెలాయించేవారు.
అధిక పన్నులు,వెట్టి చాకిరి తో ప్రజల జీవితం దుర్భరంగా ఉండేది. రైతులను నిలువు దోపిడీ చేసేవారు. గ్రామీణ ప్రజల పై నిజం ప్రభుత్వ ఉద్యోగులు,వారి తాబేదార్లు చేసై అఘాయిత్యాలు,అమానుష కృత్యాలు,అత్యాచారాలకు అంతే లేదు.
ఇక సంస్థానంలో పౌరహక్కులు మృగ్యఅం.సభలు,సమావేశాలు జరుపుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి అవసరమయేది. వాక్ స్వాతంత్రం ,పత్రిక స్వాతంత్రం ఏ మాత్రం ఉండేవి కాదు. ఇలాంటి అంధకారంలో ఆనాటి ప్రజలున్నారు.
ప్రభుత్వ అధికార భాష,భోధన భాష ఉర్దూయే. ప్రాధమిక పాటశాలల్లో కూడా ఉర్దూయే భోధన భాషగా ఉండేది. మాతృభాషలో విద్యాభ్యాసానికి అవకాశాలుండేవి కావు.
ఇక తెలంగాణ ప్రాంతంలో తెలుగువారి పరిస్థితి మరీ అద్వాన్నంగా ఉండేది. ప్రభుత్వ ఉద్యోగాలలో తెలుగువారి సంఖ్య బహు స్వల్పం. అక్షరాస్యుల సంఖ్య నూటికి నాలుగు శాతం మాత్రమే.
రాజధాని అయినా హైద్రాబాద్ నగరం తెలుగు ప్రాంతమైన తెలంగాణాలో చేరి ఉన్నప్పటికీ తెలుగు వాళ్ళెవ్వరు ఉన్నత పదవుల్లో కనిపించే వారు కాదు.
ఆనాటి భౌగోళిక సాంఘిక పరిస్థితులు :
అప్పుడు హైదరాబాద్ సంస్థానం 16 జిల్లాలు ,4 సుబాలుగా విభజించబడింది . మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ అసఫ్ జహీవంశానికి చివరి రాజు,అంటే ఏడవ రాజు .
ఈయన సింహాసనం మీదకి వస్తునై రాష్ట్ర పరిస్థితులను తెలుసుకునై మిషతో మొత్తం రాష్ట్ర పర్యటన జరిపారు . రాజు పర్యటన సందర్బంగా ప్రతిచోటా ఎన్నో వింతలు జరిగాయి ఆనాడు. ఆయన వెళ్లిన ప్రతి జిల్లాలోనూ,ప్రతి సంస్థలోనూ స్థానిక అధికారులు రాజుకు కానుకలు సమర్పించుకోడానికి నజరానాలు వసులు చేసేవారు. (నజరానాలు అంటే కానుకలు )వారు ఇష్టం వచ్చినట్లుగా నజరానాల కింద డబ్బు వాసులు చేసేవారు. ఎక్కువ నజరానాలు చెల్లించుకున్నవారు నిజాం ప్రభువుకు దగ్గరయ్యేవారు . అలాంటివారు కింది స్థాయి నుండి పైకి తొందరగా వచ్చేవారు .
ప్రభుత్వ ఉద్యోగుల నియామకం,ప్రమోషన్ ల గురించి నజరానాలు బాగా తోడ్పడేవి. నజరానాయే ఆనాటి మెరిట్ . సమర్ధత అర్హతలకు స్థానం లేదు.
కొందరు ఉద్యోగులు ఫర్మాన ల ధ్వారా నియమింపబడేవారు.వారు నేరుగా రాజుకే భాద్యులు. రాజుకు డబ్బు చెల్లించి ఉద్యోగాలు సంపాదించుకునేవారు.
ఇలా ఆనాడు హైదరాబాద్ నగరంలో కూడా నిజాం నజరానాల పేరుతో బాగా డబ్బు వసూలు చేశారు . నిజాం ప్రభువూ జన్మ దినం పండుగ రోజున ఆహ్వానితులు అంత ప్రభువూకు నజరానాలు చెల్లించుకునేవారు .
పోతే ఏడవ నిజాం తనకు డబ్బు కావలసివచ్చినప్పుడు,ఇష్టం వచ్చినప్పుడు,ఏ అమిరో లేక జాగీర్ధారు దేవీడికో వెళ్లి నజరానా పేరిట డబ్బు వసూలు చేసుకుని వచ్చేవారు . అయితే ఆ కుటుంబం యజమానే కాక కుటుంబంలోని ఆడ,మగ వారు,పిల్లలు కూడా నజరానాలను చెల్లించేవారు.నిజాం పరిపాలనలో ఓ వింత పద్దతి ఇది.
ఆనాడు సమాజంలో ఎంతో దుర్భరమైన పరిస్థితులుండేవి. మూఢ నమ్మకాలు,ఆంధ విశ్వాసాలు బాగా ప్రబలిన రోజులవి.కుల మాత బేధాలు బాగా పదుకున్న రోజులవి. అంతే కాదు బాషా లో కూడా ఎంతో భేదం కనిపించేది. సుమారు ఎనభై అయిదు సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంత సాంఘిక స్థితి గతులను నెమరువేసుకుంటే,ఈనాటి వారికి ఎంతో వింత అనిపిస్తుంది.
ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు చాలా తక్కువ. వాహనాలు చాలా అరుదు. ఆనాడు టాంగా,జట్కా,బగ్గీ (గుర్రపు బండి)అనే పదాలను చెబితే ఈ నటి వారు విస్తుపోయి చూస్తారు.
కాగా ఆనాటి హైదరాబాద్ రాష్టానికి కొన్ని వింతలున్నాయి.ఈ రాష్ట్రంలో అప్పుడు హాలీ (చార్మినార్ సిక్కా నాణెం రూపాయలు చెలామణిలో ఉన్నాయి. 1918నుండి కాగితపు కరెన్సీ నోట్ల పద్దతి కూడా చెలమని లోకి వచ్చింది. 1946 లో 44కోట్ల 44 లక్షల రూపాయల కరెన్సీ నోట్లు 1 రూపాయి నుంచి 100 రూపాయల వరకు,చెలమనిలో ఉన్నాయి.
వీటితో పాటు ఆనాడు హైద్రాబాద్ రాష్ట్రంలో కాల్దరు రూపాయలు (ఇండియా గవర్నమెంట్ రూపాయలు
లేక బి.జి. కరెన్సీ)కూడా న్యాయ సమ్మతా ద్రవ్యంగా చెలమనిలో ఉంది.
ఆ రోజుల్లో ముద్ద పైసలనే రాగి పైసలుండేవి.హాలీ రూపాయలను మారిస్తే 96 పైసలు వచ్చేవి.ఇది ఆనాటి నిజాం ప్రభుత్వపు సిక్కా -స్వతంత్ర భారతంలో నిజాం రాజ్యం విలీనమయ్యే వరకు కూడా ఈ రూపాయి వాడుకలో ఉండింది. కాగా కాల్దరు రూపాయి నిజం రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలోనే కాక హైద్రాబాద్,సికింద్రాబాద్ జంట నగరాలలో ఉండే బ్రిటిష్ సర్కారు ఉద్యోగులందరికీ జీతాలు కాల్దరు రూపాయలలోనే ఇవ్వబడేవి .
తపాలా విధానం :
అప్పటి హైద్రాబాద్ రాష్ట్ర తఫాల విధానం మరొక ప్రత్యేకతను కలిగి ఉండేది. బ్రిటిష్ ఇండియా మాదిరి రాష్ట్ర పోస్టుఫీసులుండేవి. క్రమంగా తఫాల కార్యక్రమాలన్నీ సాగుతూ ఉండేవి.వీటితో పాటు రాష్ట్ర ముఖ్య కేంద్రాల్లో భారత ప్రభుత్వ పోస్టుఫీసులు కూడా ఉన్నాయి.
సాంఘిక పరిస్థితులు :
ఆ కాలోకంలో కులమతాలు,భేదాలు ఉన్నాయి. హిందువులు తమ తమ ఆచారాలు పటించేవారు,వర్ణాంతర భోజనాలు చేసేవారు కాదు.
మధ్య తరగతికి చెందిన ముస్లిం మరియు హిందూ స్త్రీలు కూడా పరదా పద్దతి అవలంభించేవారు.అప్పుడు వెలాటారు కార్లు,బస్సులు,ఇప్పటిలా ద్విచక్ర వాహనాలు లేవు.రేడు ఎడ్లు కట్టిన "షెక్రబండ్లు "ఒక్క గుర్రం కట్టిన జట్కా,టాంగా బండ్లు,ఒక్క గుర్రం లేక రేడు గుర్రాలు కత్తితోలే బగ్గీలు ఉండేవి.
పెద్ద పెద్ద జాగీరు ప్రభుత్వ పెద్ద ఉద్యోగస్తులు,శ్రీమంతులు బగ్గీలు వాడేవారు. బోయలు మోసే మెనలు కూడా బాగా వాడేవారు.
ఆకాలంలో ప్రజలలో ఎలాంటి చైతన్యం లేదు. చదువు కున్న వారి సంఖ్య చాలా తక్కువ.
పత్రికలు :
ఆ కాలంలో రెండు ఉర్దూ దిన పత్రికలు "ముసీర్ దక్కన్ """సఫీఫా" ఉండేవి. సికింద్రాబాద్ నుండి "బులిటిన్ " అనే ఇంగ్లీష్ పత్రిక వెలివడేది .తెలుగులో కానీ,మరాఠీ,కన్నడం లో కానీ పత్రికలు అసలే లేవు. అసలు ఉన్నపత్రికలు కూడా చదివే వారే కాదు.
అప్పుడు హైద్రాబాద్ రాష్టాన్ని తెలంగాణ, మరాఠాడా, కర్నాటక
ప్రాంతాలుగా పేర్కొన్నారు.అత్రాఫ్ భల్ద నిజామాబాద్, మెదక్, మహాబూనగర్, నల్గొండ ,కరీంనగర్ ,ఆదిలాబాద్ జిల్లాలు-మరాఠాడా ప్రాంతంలో ఔరంగాబాద్ ,బీడ్ ,నాందేడ్ ,పర్భానీ జిల్లాలు -కర్ణాటక ప్రాంతంలో గుల్భర్గా ,బీదర్ ,రాయచూర్ ,ఉస్మానాబాద్ -ఉండేవి. కోటి పై చిలుకు తెలుగు వారు,నలభై లక్షల మంది మారాఠీలు,ఇరవై లక్షల మంది కన్నడీలు ,ఇరవై లక్షల పై చిలుకు ఉర్దూ ,హిందీ మాట్లాడేవారు ఉండేవారు.
20వ సేతాబ్దపు తొలి రోజులలో నిజాం సంస్థానం వెలలేని సంపదలకు ,వెట్టి బానిసలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది . చివరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపంచంలోనే అత్యధిక ధనవంతునిగా రికార్డు నెలకొల్పాడు.
ప్రతి పౌరుడు పన్ను చెల్లించాల్సిందే:
ప్రతి పౌరుడు సర్కారుకి ఇంత పన్ను చెల్లించాలి అని నిర్ణయించేవారు. దానిని వసూలు చెయ్యడానికి అతనిని పలు విధాలుగా భాదలు పెట్టేవారు.చిత్ర హింసలకు గురి చేసేవారు.
చెవులకు బరువులు కట్టడం,ఛాతి పై పెద్ద బండలు పెట్టడం,కాగే నూనెలో వేళ్ళు ముంచడం ఆనాడు సాధారణ మైన శిక్షలు.బాధలకు తాళ లేక వారు పెట్టె ఆక్రందనాలు వాటిని అమలు జరిపే వారి రాక్షస ప్రవృత్తిని సూచిస్తాయి.
ఆనాడు పాలక వర్గాలైనా జాగీర్ధారుకు హక్కులు బాధ్యతలు లేవు. పాలితులు అంటే ప్రజల పిల్లలకు చదువులు,వారి రోగాలకు మందుల మాటలు అటుంచి వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన సాగునీటి వనరులను ,తాగునీటి సౌకర్యాలను సైతం కల్పించలేదు.
ఫ్యూడల్ వ్యవస్థ:
ఇక ఈ మధ్య యుగపు ఫ్యూడల్ నిజాం పరిపాలన బ్రిటిష్ రాజ్య పతనా అవస్థతో ఇస్లాం రాజ్య మతోన్మాదం కూడా తోడైంది.దీంతో ప్రజా జీవనం మరింత నరకప్రాయంమైంది. బ్రిటిష్ ఇండియాలోని వారికే పౌరహక్కులు లేవంటే నిజాం రాష్టంలోని ప్రజలు మనుషులే కానీ పరిస్థితి నెలకొంది.
హైద్రాబాద్ రాజ్యంలో ముస్లింల ఆధిపత్యం అనన లక్ష్యంతో "మజ్లీస్ -ఏ -ఇత్తెహాద్ -ఉల్ -ముస్లామిన్ " 1929లో ఏర్పడింది. ముస్లింలు పాలకులు -వారు హైద్రాబాదు రాష్టంలోని ఇతర ప్రజలను పరిపాలించడానికికే జన్మించారు అన్న సూత్రం ముస్లింల మనోభావాలను రెచ్చగొట్టే అత్యధిక శాతం ముస్లిం ప్రజలను తమవైపు తిప్పుకోవడంలో పార్టీ సఫలమైంది .
హిందూ సమాజంలో అంటరాని వారుగా ఉన్న అట్టడుగు వర్గాల ప్రజలను సామాజిక గౌరవం ,రాజకీయ హక్కులు ,ఆర్ధిక సహాయంపేరిట ప్రలోభపెట్టి సామూహిక మత మార్పిడిలకు శ్రీకారం చుట్టారు . 1938నాటికి ఈ సంస్థ దాదాపు 12 వేల మందిని ముస్లింలుగా మార్చి వేసినట్టుగా అధికారిక లెక్కలు చెప్పాయి.

ConversionConversion EmoticonEmoticon