1.అమ్మకానికి ట్విట్టర్..?
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను ఆ సంస్థ విక్రయించడానికి సన్నద్ధమైందట. ఆ సంస్థ ఇప్పటికే కొన్ని కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే పేరు ప్రఖ్యాతుల పరంగా ట్విట్టర్‌కు ఎదురులేకపోయినా..మందగిస్తున్న యూజర్ వృద్ధి, తక్కువగా నమోదవుతున్న వ్యాపార ప్రకటనల ఆదాయాలతో గత కొంతకాలంగా ట్విట్టర్ వందల మిలియన్ డాలర్ల నష్టాలను మూటకట్టుకుంటోంది.అంతర్జాతీయంగా జరుగుతున్న న్యూస్, ఎంటర్ టైన్ మెంట్, సోషల్ కమెంటరీ వంటి వార్తలను అందించడంలో ట్విట్టర్ కు తిరుగులేని ఆధిపత్యం ఉంది. ట్విట్టర్ ఇప్పటికే గూగుల్ వంటి పలు టెక్నాలజీ కంపెనీలతో చర్చలు ప్రారంభించింది.త్వరలోనే గూగుల్ నుంచి బిడ్ దాఖలు కానున్నట్టు తెలుస్తోంది. దీనిపై ట్విట్టర్‌గానీ గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన అల్ఫాబెట్ ఐఎన్‌సీగానీ స్పందించడానికి నిరాకరించాయి. ఇప్పటికే యాహూను కొనుగోలు చేసిన వెరిజోన్ కంపెనీ కూడా బిడ్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.ఈ వార్తలతో మార్కెట్లో ట్విట్టర్ షేర్లు ఒక్కసారిగా 19 శాతం ఎగశాయి. ఈ కంపెనీ షేర్లు 2013 తర్వాత ఇంతగా పెరగటం ఇదే తొలిసారి. దీంతో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ 16 బిలియన్ డాలర్లకు చేరింది.
2. యాహూకి మరో షాక్!
యాహూ నిర్లక్ష్యం వల్ల 2014లో భారీ స్థాయి లో హ్యకింగ్ జరగడం, 500 మిలియన్ల ఖాతాదారుల సమాచారం చోరీకి గురైందని ఆ సంస్థ ప్రకటించింది.దీనితో ఓ వినియోగాదారుడు కాలిఫోర్నియాలోని సాన్‌జోస్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ హ్యాకింగ్ వెనుక ప్రభుత్వ హస్తం ఉన్నట్లు ఆరోపణలు కూడా వచ్చాయి.వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతను కాపాడతామని వాగ్దానం చేసిన సంస్థ ఘోరమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని స్క్వార్జ్ ఆరోపించారు.అయితే దీనిపై స్పందించడానికి యాహూ ప్రతినిధి సన్నీవేల్ తిరస్కరించారు.

3. ‘బ్రిక్స్’ సదస్సు లో కీలక నిర్ణయం
దిల్లీలో నిర్వహించిన బ్రిక్స్ దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం ముగింపు సందర్భంగా శుక్రవారం పలు నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ వాణిజ్య విధానాలకు కట్టుబడుతూ బ్రిక్స్ దేశాల(బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) వ్యవసాయ మంత్రులు శుక్రవారం వ్యవసాయ ఎగుమతుల రాయితీల ఎత్తివేతకు ఆమోదం పలికారు. ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయ అభివృద్ధి, పేదరిక నిర్మూలనకు సభ్య దేశాల మధ్య సహకారం పెంపొందించుకునేందుకు ఈ వేదిక తోడ్పడుతుంది. ఈ పరిశోధన వేదిక ఏర్పాటు బాధ్యతను భారత్ తీసుకుంది.
4. ఫ్లిప్ కార్ట్ తో జతకట్టిన యాపిల్
అక్టోబర్ 7 నుంచి టెక్ దిగ్గజం యాపిల్, ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భారత్ లో మొదలుకానున్నాయి అనే విషయం తెలిసిందే అయితే ఈ ఫోన్లను నేరుగా వినియోగదారుడికి అందించడానికి యాపిల్ సంస్థ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తో జతకట్టింది. ఆన్ లైన్ లో ఈ ఫోన్ల అందుబాటుని మరింత విస్తరించడానికి ఫ్లిప్ కార్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు యాపిల్ ఇండియా ప్రకటించింది. ఐఫోన్7 సిరీస్ ఫోన్లతో పాటు, పాత ఐఫోన్ మోడల్స్ ను సైతం ఫ్లిప్ కార్ట్ లో నమోదుకానున్నాయి. ఈ మాదిరి ఆన్ లైన్ సైటుతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి. గత కొన్నేళ్లుగా ఐఫోన్ల విక్రయానికి భాగస్వామిగా ఉంటున్న ఇన్ఫిబీమ్ కూడా ఈ ఫోన్లను అందించనుంది. ఐఫోన్7 ఫోన్ 32జీబీ వేరియంట్ రూ.60,000 నుంచి ప్రారంభమవుతుంది. అంతే స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉన్న ఐఫోన్ 7 ప్లస్ ను రూ.72,000కు విక్రయించనుంది.
5.
ConversionConversion EmoticonEmoticon