CURRENT AFFAIRS ON 23-09-2016

1.3 వేలకే 4జీ స్మార్ట్ ఫోన్ 

చౌక ధర కలిగిన  స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ డేటావిండ్ దేశీయ మార్కెట్ లోకి రూ.3 వేల ధర కలిగిన 4జీ మొబైల్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.ఈ 4జీ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికీ ఏడాది పాటు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందించనున్నట్లు చెప్పారు .

2.జీఎస్‌టీ నుంచి మినహాయింపు 

 జీఎస్‌టీ కి సంబంధించి కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది.జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఎంత ఆదాయ పరిమితిని విధించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు.ఆదాయ పరిమితిని రూ.20లక్షలుగా ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాల్లో ఉన్న వారికి ఈ పరిమితిని రూ.10లక్షలుగా నిర్ణయించారు.వ్యాపారుల వార్షిక ఆదాయం ఈ పరిమితి కన్నా తక్కువగా ఉంటే జీఎస్‌టీ నుంచి మిహాయింపు లభిస్తుంది. ప్రత్యక్ష పన్నుల పరిధిలోకిరారు. రూ.20లక్షల టర్నోవర్‌ పైబడిన వారికి జీఎస్‌టీ వర్తించనుంది.

3. 25 నుంచి ‘స్వచ్ఛభారత్‌ వారం’

‘స్వచ్ఛభారత్‌’ రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 2 వరకు ‘స్వచ్ఛభారత్‌ వారం’గా పాటించనున్నారు. 

4. 36 రాఫెల్‌ ఫైటర్స్‌కు.. రూ.58,000కోట్లు 

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ చేతికి కొత్త ఆయుధాలు రాబోతున్నాయి.ఫ్రాన్స్‌ నుంచి 36 రాఫెల్‌ యుద్ధ విమానాలు దాదాపు రూ.58వేల కోట్ల(7.87 బిలియన్‌ యూరోలు)కు కొనుగోలు చేసేందుకు  ఫ్రాన్స్ ర‌క్ష‌ణ మంత్రి జీన్ వెస్ లీడ్రియాన్‌, భార‌త ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ ఇవాళ ఢిల్లీలో ఒప్పంద ప‌త్రాలపై సంత‌కాలు చేశారు. మనదేశ అమ్ములపొదిలో లేని ‘మెటియోర్‌’, ‘స్కాల్ప్‌’ వంటి క్షిపణులు రాఫెల్‌ యుద్ధవిమానాలతో కలిసి భారత వైమానిక దళానికి అందనున్నాయి.వీటి వ్యాప్తి సామర్థ్యం 150కి.మీ.ల పైనే.పాక్‌ వద్ద ప్రస్తుతం 80కి.మీ.ల వ్యాప్తిలో లక్ష్యాలను ఛేదించగలిగే బీవీఆర్‌ అస్త్రాలే ఉన్నాయి.
Previous
Next Post »