1.జుకర్‌బర్గ్
సంచలన నిర్ణయం
మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ సీఈవో తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే తన సంపదలో 99శాతం చారిటీకి ఇస్తానని ప్రకటించిన ఆయన ఇప్పుడు వ్యాధుల నిర్మూలన కోసం 3 బిలియన్ డాలర్ల ఖర్చు చేయనున్నట్లు జుకర్, ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్ ప్రకటించారు.చిన్న వయసులోనే వ్యాధుల బారిన పడి.. జీవితాన్ని కోల్పోతున్న చిన్నారుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.చిన్నారులకు వచ్చే వివిధ రకాల వ్యాధులను నిర్మూలించేందుకు కృషి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. జుకర్ మాట్లాడుతూ.. మన చిన్నారులకు మంచి, ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఇద్దామని పిలుపునిచ్చారు.ఈ శతాబ్దం చివరి నాటికి చిన్నారుల్లో వ్యాధులంటే ఏమిటో తెలియకుండా ఉండాలన్నారు. జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్‌పై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ హర్షం వ్యక్తంచేశారు.
2. మొండి ఇన్‌ఫెక్షన్లపై ఐరాస సమరం
మందులకు లొంగని ఇన్‌ఫెక్షన్లను, మొండి సూక్ష్మక్రిములను తుద ముట్టించటానికి ఐక్యరాజ్యసమితిలోని 193 దేశాలు చరిత్రాత్మక ప్రకటనపై సంతకాలు చేశాయి.2001లో హెచ్‌ఐవీ, 2011లో సాంక్రమికేతర జబ్బులు, 2013లో ఎబోలాపై ఐరాస ప్రకటనలు చేసింది.ఒక ఆరోగ్య అంశంపై ఐరాస ప్రకటన చేయటం ఇది నాలుగోసారి.ఇది విజయవంతమైతే ఏటా 7 లక్షల మరణాలను నివారించే అవకాశముంది.

3. డిసెంబరు
5-13 మధ్య నీట్ పరీక్ష
జాతీయ పరీక్షల మండలి(ఎన్‌బీఈ) వైద్య విద్యలో
పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ‘జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష’(నీట్)ను నిర్వహించనుంది.ఈ ఏడాది డిసెంబరు 5-13
తేదీల మధ్య దేశవ్యాప్తంగా 41 నగరాల్లోని 86 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
ఎండీఎస్ (దంతవైద్యం)లో ప్రవేశాలకు నవంబరు 30 నుంచి డిసెంబరు 3
మధ్య నీట్ నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.
ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సులకు రాష్ట్ర
కోటా సీట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, జమ్ముకశ్మీర్, తెలంగాణలు సహా
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకూ ఇదే అర్హత పరీక్ష అని స్పష్టం చేశారు.నీట్-పీజీ, నీట్-ఎండీఎస్‌లకు వెబ్‌సైట్ ఈ నెల 24 నుంచి అందుబాటులో ఉంటుందని,
26 నుంచి వచ్చే నెల 31 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ప్రకటనలో
వెల్లడించారు.
ConversionConversion EmoticonEmoticon