CURRENT AFFAIRS ON 26-09-2016

1.ట్విట్టర్ కొనుగోలు బరిలోనుండి మైక్రోసాఫ్ట్ ఔట్ 

ట్విట్టర్ అమ్మకం  వార్త గత నేలగా వింటున్నాం. అయితే ఈ విక్రయానికి సంబంధించి పలు టెక్నాలజీ కంపెనీల తో చర్చలు జరుపుతుంది . గూగుల్, వెరిజోన్, మైక్రోసాప్ట్ లు ట్విట్టర్ ను చేజిక్కించుకోవడానికి పోటీ పడుతున్నట్టు సమాచారం. ఇవి త్వరలోనే బిడ్డింగ్ దాఖలు చేయనున్నాయని తెలిసింది.
 కానీ ట్విట్టర్ ను కొనుగోలు చేసే ఆలోచన నుంచి టెక్ దిగ్గజం మైక్రోసాప్ట్ తప్పుకుందట. త్వరలోనే దాఖలు చేయబోయే బిడ్డింగ్ ను ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ట్విట్టర్ కొనుగోలు నుంచి మైక్రోసాప్ట్ తప్పుకోవడంతో ఏ కంపెనీ దీన్ని చేజిక్కించుకుంటుందో వేచిచూడాలి.

2. మిస్‌.యునైటెడ్‌ కాంటినెంట్స్‌ పోటీలో భారత యువతికి బహుమతి 

మిస్‌. యునైటెడ్‌ కాంటినెంట్స్‌ ద్వితీయ రన్నరప్‌గా భారత్‌కు చెందిన అందాల సుందరి లోపాముద్ర రావత్‌ నిలిచారు. ఈక్వెడార్‌లోని గయాక్విల్‌లో జరిగిన ఈ అందాల పోటీల్లో ఫిలిప్పీన్స్‌ సుందరి జెస్లిన్‌ శాంటోస్‌ ‘మిస్‌.యునైటెడ్‌ కాంటినెంట్స్‌’ కిరీటాన్ని దక్కించుకున్నారు. ద్వితీయ రన్నరప్‌గా నిలిచిన లోపాముద్రకు దాదాపు రూ.పదిలక్షల నగదు బహుమతి లభించింది.

3. మరణించి 3 వందల ఏళ్లు..ఇప్పుడు తెరిచింది కళ్లు! 

ఎప్పుడో మూడువందల ఏళ్ల క్రితం మరణించినట్లుగా చెబుతున్న మహిమాన్వితగా పేర్కొనే ఓ క్రైస్తవ చిన్నారి  హఠాత్తుగా కళ్లు తెరిచి చూసిందనే వార్త ఇప్పుడు మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆమె పార్థివదేహం అద్దాల పెట్టెలో నేటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉంది. జెలిస్కో ప్రాంతంలోని ఓ చర్చిలో ఆ పార్థివదేహం ఉంది . 3 వందల ఏళ్ల నుంచీ మైనంతో చేసే ఒక ప్రక్రియతో ఆ భౌతికకాయాన్ని పరిరక్షిస్తున్నారు.ఇదంతా భ్రమ అని కొట్టిపారేసే వారు కొందరైతే....ఏమో ఇది దేనికి సంకేతమో! అంటూ ఆశ్చర్యపోతున్న వారెందరో. యూట్యూబ్‌లో ఉంచిన ఆ ఫుటేజీని చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది.ఈ లింక్ ని క్లిక్ చేయండి . 
https://www.youtube.com/watch?v=wXVBN14IXO0

4. చరిత్ర సృష్టించిన ‘పీఎస్‌ఎల్వీ-సీ35’ 

అంతరిక్ష పరిశోధన పరిశోధన రంగంలో ఎదురు లేని శక్తీ గా  భారత్   నిలిచింది.ఒకే వాహకనౌక ద్వారా ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచ ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ-సీ35 వాహకనౌక విజయవంతంగా తన పని పూర్తిచేసింది.తొలుత స్కాట్‌శాట్‌-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహకనౌక... మిగిలిన వాటిని నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. పీఎస్‌ఎల్వీ-సి35 ద్వారా మన దేశానికి చెందిన స్కాట్‌శాట్‌-1 ఉపగ్రహంతో పాటు అల్జీరియా, కెనడా, అమెరికా దేశాలకు చెందిన మరో ఏడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది.ఈ ప్రయోగం ద్వారా జర్మనీకి చెందిన మ్యాక్స్‌ వల్లర్‌,వెంటా-1,కెనడాకు చెందిన ఎన్‌ఎల్‌ఎస్‌-19, యూఎస్‌ఏకు చెందిన పాత్‌ ఫైండర్‌-1, అల్జీరియాకు చెందిన ఆల్‌శాట్‌-2బీ, ఆల్‌శాట్‌-1బీ, ఆల్‌శాట్‌-1ఎన్‌,వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రథమ్‌, పీశాట్‌ ఉప్రగహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం సముద్రాల్లో వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు దోహద పడనుంది.ఈసారి ప్రత్యేకత ఏంటంటే  ఒకే రాకెట్‌తో అనేక ఉపగ్రహాలను భిన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడం. 

5. రీతూ కు పోలిష్ టైటిల్

భారత షట్లర్ రీతూ పర్ణ దాస్ అంతర్జాతీయ వేదిక పై మెరిసింది. పశ్చిమబెంగాల్ కు చెందిన ఈ క్రీడ కారిణి పోలిష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బాడ్మింటన్ టోర్నమెంట్ లో ఛాంపియన్ గా నిలిచింది.ీతూ పర్ణ భారత్ కే చెందినా రసిక రాజే  పై విజయం సాదించి ట్రోఫీ ని ముద్దాడింది.

6. రూ. 30 లక్షలు పలికిన చితాభస్మం!

అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత ట్రూమాన్ కాపోటే.ఆయన చనిపోయి ౩౦ ఏళ్ళు అయింది.అయిన ఆయనకు ఆదరణ తగ్గలేదు.ఆయనకు సంబందించిన వస్తువులను వేలంలో ఉంచినప్రతిసారి అత్యదిక ధరకు అమ్ముడవటమేఇందుకు నిదర్శనం.తాజాగా ట్రూమన్ కాపోటే చితాభస్మం వేలంలో సుమారు రూ. 30 లక్షలకు అమ్ముడుపోయింది.
కాపోటే మాజీ భార్య జానీ కార్సన్, ఆయన స్నేహితుడు జాయన్నె కార్సన్ శనివారం లాస్ ఏంజెలెస్ లోని జూలియన్ ఆక్షన్స్ లో వేలం వేశారు.



Previous
Next Post »