CURRENT AFFAIRS ON 20-09-2016

1.  గ్రూప్‌-2 షెడ్యూల్‌లో స్వల్పమార్పులు

 తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నవంబర్‌ 12, 13 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించగా.. ప్రస్తుత షెడ్యూల్‌లోనవంబర్‌ 11, 13 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
 నవంబర్‌ 12వ తేదీన ఐఎఫ్‌ఎస్‌ రాత పరీక్ష కారణంగా తొలి పరీక్షను 11వ తేదీకి మార్చినట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

2. లాంగ్ రేంజ్ క్షిపణి ప్రయోగం విజయవంతం

 భారత్ మరో క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలు ఛేదించగల లాంగ్‌ రేంజ్‌ క్షిపణిని మంగళవారం విజయవంతంగా ప్రయోగించింది.
 ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌(ఐటీఆర్) నుంచి ఈ క్షిపణి ప్రయోగం చేసినట్లు డీఆర్‌డీఓ అధికారులు వెల్లడించారు.
 కాగా, ఈ క్షిపణిని ఇజ్రాయెల్‌, భారత్‌ సంయుక్తంగా రూపొందించాయి. లాంగ్‌ రేంజ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని.. త్వరలో మరిన్ని విడతల్లో ఈ క్షిపణిని ప్రయోగిస్తామని అధికారులు తెలిపారు.

 ఈ క్షిపణిలో మల్టీ ఫంక్షనల్‌ సర్వైలెన్స్‌ అండ్‌ త్రెట్‌ అలర్ట్‌ రాడార్‌(ఎంఎఫ్‌-ఎస్‌టిఏఆర్) సిస్టమ్‌ ఉంటుంది.


Previous
Next Post »