CURRENT AFFAIRS ON 18-9-2016

1.ఆసియా లో అత్యుత్తమ మ్యూజియంలు 

భారత్ లోని ఐదు పురావస్తు ప్రదర్శన శాలలు ఆసియా లోనే బెస్ట్ 25 జాబితాలో నిలిచాయి.ట్రిప్ అడ్వైయిజర్ వెబ్ సైట్, ట్రావెలర్స్ ఛాయస్ అవార్డులను ప్రకటించింది. ఇండియా లోని టాప్ 10 పురావస్తు ప్రదర్శనశాలలుగా స్థానాన్ని దక్కిచుకున్నవి ఇవి:

1. లేహ్ "హాల్ అఫ్ ఫేమ్ "మొదటిగా నిలిచింది.
2. ఉదయపూర్ లోని "బాగోర్ కీ హవేలీ ".
3. కోలకతా లోని "విక్టోరియా మెమోరియల్ హాల్ ".
4. హైదరాబాద్ లోని "సాలార్ జంగ్ మ్యూజియం".
5. జైసల్మార్ లోని "జైసల్మార్ వార్ మ్యూజియం".
6. టోరు లోని "హెరిటేజ్ ట్రాన్స్ పోర్ట్ మ్యూజియం".
7. కొల్హాపూర్ లోని "సిద్ధగిరి మ్యూజియం".
8. ఢిల్లీ లోని "గాంధీ స్మృతి మ్యూజియం".

2. డెఫ్ షూటింగ్ లో కాంస్యం 

తొలిసారిగా వినికిడి లోపం ఉన్న అథ్లెట్ కు నిర్వహించిన వరల్డ్ డెఫ్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో భారత షూటర్ ప్రియేష దేశముఖ్ కాంస్యంతో ఆకట్టుకుంది.రష్యా లోని కజాన్ లో జరిగిన ఈ ఈవెంట్ లో 10.మీ ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్ లో 180.4 స్కోరుతో మూడో స్థానం లో నిలిచింది.

3. క్షిపణి నాశక యుద్ధనౌక ప్రారంభం 

ప్రపంచంలోనే అత్యాధునిక,స్వదేశీ క్షిపణి నాశక యుద్ధనౌక ఐన్ఎస్ "మొర్ముగావో "ను ప్రారంభించారు.ముంబై లోని మాజ్ గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో నావికా దళాధిపతి అడ్మిరల్ సునీల్ లంబా సతీమణి రీనా ఈ నౌక ను ప్రారంభించారు.పూర్తి స్వదేశీ పరిజ్ఞానం తో తయారైన ఈ క్షిపణి నాశక నౌక ప్రపంచం లో ఉన్న ఉద్ధనౌకలన్నిటి కంటే అత్యుత్తమంగా పనిచేస్తుంది.  అత్యాధునిక స్టెల్త్ డిస్ట్రాయర్ ను ఇందులో అమర్చారు.



Previous
Next Post »