CURRENT AFFAIRS ON 17-09-2016

1.వేడిని విద్యుత్ గా  మార్చే పదార్థం 

వృధా అవుతున్న వేడిని శక్తిగా మార్చే పదార్ధాన్ని పరిశోధకులు కనుగొన్నారు.థర్మల్ పవర్ ప్లాంట్లు మొదలుకుని వాహనాలనుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే వీలుంది.మనం లీటర్ నీళ్లు పోస్తే అందులో ప్రయాణానికి ఉపయోగపడేది 20% మాత్రమే.మిగిలినదంతా వేడి రూపంలో వెళ్ళిపోతుంది.థర్మల్ పవర్ ప్లాంట్లలో అయితే 50% -60% వరకు వృధా అవుతుంది.దీనిని దృష్టిలో పెట్టుకుని పర్డ్యూ వర్సిటీ శాస్త్రవేత్తలు నానోస్థయి టంగ్ స్టన్,హఫీనీయం ఆక్సిడేలతో వేడిని విద్యుత్ గా మార్చే పదార్థాన్ని తయారు చేసారు.

2. తృటిలో చేజారిన కాంస్యం 

పారా లింపిక్స్ లో భారత అథ్లెట్ అమిత్ కుమార్ సరోహ తృటిలో కాంస్యంచేజార్చుకున్నారు. ఎఫ్51 క్లబ్ త్రో ఈవెంట్లో ఈ హరియాణా పారా అథ్లెట్ 26.63మీ దూరం విసిరి నాలుగో స్థానం లో నిలిచారు.జెల్జికో దిమిత్రి జెవిక్ తొలి స్థానం లో నిలిచి ప్రపంచ రికార్డు సృష్టించాడు.మరియన్ కురేజా 26.82మీ విసిరి  కాంస్యం సాధించాడు.

3.'అర్జున' ను అందుకున్న రోహిత్ మరియు రహానే 

భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ,అజింక్యా రహానే అర్జున పురస్కారాలను అందుకున్నారు. జవహర్లాల్ నెహ్రు స్టేడియం లో క్రీడా మంత్రి విజయ్ గోయల్ వారికి ఈ క్రీడా పురస్కారాలు అందించారు.అవార్డు కింద ఇద్దరికి రూ.5 లక్షల నగదుతో పాటు  ప్రతిమను అందించారు.

4.వరల్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో దిగువకు భారత్ 

వరల్డ్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో భారత్ ర్యాంక్ తగ్గింది. ఇండియా పది స్థానాలు కోల్పోయి 112 వ స్థానంలో నిలిచింది.న్యాయ వ్యవస్థ,ఆస్తి హక్కు,అంతర్జాతీయ వ్యాపారం,నియంత్రణలు,
ప్రభుత్వపు పరిమాణం వంటి పలు అంశాలలో భారత్ పేలవ ప్రదర్శన కనబరిచింది.చైనా 113 స్థానంలో,బాంగ్లాదేశ్ 121 స్థానంలో,పాకిస్తాన్ 133 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.టాప్ లో హాంకాంగ్,సింగపూర్,న్యూజీలాండ్ ,స్విట్జర్లాండ్ ,కెనడా ,జార్జియా ,ఐర్లాండ్ ,మారిషస్ ,
యూఏఈ,ఆస్ట్రేలియా ,యూకే వంటి దేశాలు ఉన్నాయి.

5. విమోచనానికి 68 ఏండ్లు 

హైదరాబాద్ స్టేట్ ను భారత్ లో విలీనం చేసిన సందర్భంగా నాటి కేంద్ర హోంమంత్రి వల్లభాయ్ పటేల్ కు నమస్కరిస్తున్న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హైదరాబాద్ స్టేట్ లో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతం పోలీస్ చర్య ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న భారత్ లో విలీనమయింది.

6.ఆరు నెలల్లో ఆధార్ యాప్

మరో 6 నెలల్లో ఆధార్ యాప్ రానుంది. పూర్తి స్థాయిలో సురక్షితం,గోప్యతలతో దీన్ని సంబంధిత ప్రాధికార సంస్థ యూఐడీఏఐ అభివృద్ధి చేస్తుంది.ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆ తర్వాత యాపిల్,మైక్రోసాఫ్ట్ ఓస్ లకు అనుగుణంగా లభిస్తుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ బయోమెట్రిక్ వివరాలను అవసరాలకు అనుగుణంగా చూసుకోవచ్చు . ఇది ఒన్ టైం పాస్వర్డ్ ఆధారంగా పనిచేస్తుంది. యాప్ ను వినియోగించిన ప్రతిసారి దానికి అనుసంధానమైన ఇమెయిల్ కు వెంటనే సమాచారం అందుతుంది.
యాప్ విశేషాలు 
పాస్ వర్డ్ రక్షణ లో ఉండటం వల్ల ఒకవేళ ఫోన్ పోగొట్టుకున్న ఆధార్ యాప్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉండదు.
ఈ యాప్ ను ఎన్ని సార్లు ,దేనికి వినియోగించింది మొత్తం చరిత్ర ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. దింతో వేరేవాళ్లు వినియోగిస్తే వెంటనే తెలుసుకోవచ్చు. 
Previous
Next Post »