1.కంప్యూటర్ చిప్‌ల కంటే వేగం
కంప్యూటర్ చిప్‌ల వేగాన్ని నాలుగు రెట్లకు పెంచే అధునాతన పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ‘బిగ్ డేటా’ సాంకేతికతలో ఎదురయ్యే ‘మెమొరీ’ సమస్యకు దీంతో పరిష్కారం లభించే వీలుంది. మస్సాచుసెట్స్ సాంకేతిక వర్సిటీ(ఎంఐటీ) పరిశోధకులు ఓ కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కొన్ని అల్గారిథమ్‌లు, ప్రోగ్రాంలు సిద్ధంచేశారు.వీటి సాయంతో చిప్‌లలో సమాచారం మనం కోరినప్పుడు ఫోల్డర్లు భారీగా ఉన్నా.. అవసరమైన కొన్నింటినే కంప్యూటర్ గాలిస్తుంది. ఫలితంగా చాలా వరకూ సమయం వృథాని అరికట్టొచ్చని పరిశోధకులు సామన్ అమర్‌సింఘె తెలిపారు.ప్రస్తుతం సంప్రదాయ మెమొరీ నిర్వహణ విధానాల ఆధారంగా చిప్‌లను తయారుచేస్తున్నారు. ప్రస్తుత ప్రోగ్రాంలను ఇంకా అభివృద్ధిచేస్తే మరిన్ని విస్తృత ప్రయోజనాలు ఒనగూరే అవకాముందన్నారు.
2. స్వచ్ఛభారత్ మస్కట్‌గా 105ఏళ్ల ఓ మహిళ
స్వచ్ఛభారత్ కార్యక్రమం తో దేశం లో ఎంతో మంది స్ఫూర్తి పొందారు అందులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 105ఏళ్ల కున్వర్‌బాయి కూడా ఒకరు. స్వచ్ఛభారత్ కార్యక్రమం నుంచి స్ఫూర్తి పొందిన ఆమె తాను పెంచుకుంటున్న మేకలను అమ్మి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకుంది.
అందుకుగాను ప్రధాని మోదీ ప్రశంసలందుకున్న ఆమెను తాజాగా ప్రభుత్వం స్వచ్ఛభారత్ చిహ్నం(మస్కట్)గా ప్రకటించనుంది. సెప్టెంబర్ 17న ‘స్వచ్ఛ దివస్’ సందర్భంగా దిల్లీలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని చేతులమీదుగా ఆమెను సత్కరించనున్నారు.
3.యూనియన్ బ్యాంక్ ఈడీగా అతుల్ గోయల్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అతుల్ కుమార్ గోయల్ నియమితులయ్యారు. ప్రస్తుతం అలహాబాద్ బ్యాంక్ జనరల్ మేనేజర్‌గా ఉన్న అతుల్.. గురువారం ఈ బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
4.ఐరాస రాయబారిగా ఓ బానిస
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అకృత్యానికి బలై.. నెలల తరబడి బానిసగా నరకం అనుభవించిన నిస్సహాయురాలు. అలాంటి అరాచక పరిస్థితులను ఎదుర్కొని చీకటి ప్రపంచం నుంచి బయటకొచ్చిన ఆమె.. ఇప్పుడు ఎందరో నిస్సహాయులకు ప్రతినిధిగా ఉండబోతోంది. ఆమే నదియా మురద్. ఐఎస్ సెక్స్‌స్లేవ్ బతుకు నుంచి విముక్తి పొందిన నదియా.. ఐక్యరాజ్యసమితి రాయబారిగా ఎంపికైంది. మనుషుల అక్రమ తరలింపు అంశంపై ఆమె గుడ్‌విల్ అంబాసిడర్‌గా పనిచేయనుంది. 2015లో ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్‌లో ప్రసంగించిన నదియా.. తాను గడిపిన బానిస బతుకును కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఆమె ఆత్మస్థైర్యాన్ని మెచ్చి.. ఐరాస గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించారు.
5.జాతీయ మానవీయ పురస్కారానికి భారత అమెరికన్ వైద్యుడి ఎంపిక
భారత అమెరికన్ వైద్యుడు, రచయిత అబ్రహాం వర్ఘీస్‌ను ప్రతిష్ఠాత్మక ‘జాతీయ మానవీయ పతకానికి’ ఎంపిక చేసినట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ తెలిపింది. స్టాన్‌ఫర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వర్ఘీస్.. ‘మై ఓన్ కంట్రీ’, ‘కటింగ్ ఫర్ స్టోన్’ సహా మంచి ఆదరణ పొందిన అనేక పుస్తకాలను రచించారు. ‘‘వర్ఘీస్ అసాధారణ వైద్యుడు మాత్రమే కాదు.. అసాధారణ మానవతావాది’’ అని తెలిపింది. ఈ నెల 21న జరిగే ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారని పేర్కొంది.
6. గూగుల్ ఛాలెంజ్‌కు మీరు రెడీనా...
నెక్సస్ ఫోన్లలో సాంకేతిక లోపాలను గుర్తించే వారికి గూగుల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెక్సస్ 6పీ, 5ఎక్స్ మోడల్ ఫోన్లలో లోపాలను గుర్తించి వాటిని హ్యాక్ చేస్తే 2లక్షల డాలర్ల భారీ నజరానా ఇవ్వనున్నట్లు గూగుల్ వెల్లడించింది.ఇందుకోసం కొత్తగా ‘ప్రాజెక్ట్ జీరో ప్రైజ్’ పేరుతో ఛాలెంజ్‌ను ప్రారంభించింది. కేవలం ఫోన్ నంబర్.. ఈమెయిల్ ఐడీతో నెక్సస్ ఫోన్‌ను హ్యాక్ చేయగలిగితే మొత్తం 350,000 డాలర్లు నగదు బహుమతి ఇవ్వన్నుట్లు గూగుల్ ప్రకటించింది. అందులో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి 2,00,000 డాలర్లు(దాదాపు రూ. 1.3 కోట్లు) ఇవ్వనున్నట్లు తెలిపింది. రెండో స్థానంలో నిలిచిన వారికి 100,000(రూ.67లక్షలు), మూడో ప్రైజ్ కింద కనీసం 50,000డాలర్లు(రూ.33.5లక్షలు) నజరానా ఇవ్వనున్నట్లు వెల్లడించింది.తమ ఉత్పత్తుల్లో లోపాలు లేకుండా చేసేందుకు కంపెనీలు కోట్లు ఖర్చు చేస్తున్నాయి. అలాంటి జాగ్రత్తతోనే ‘బగ్‌బాంటీ’ పేరుతో ఫేస్‌బుక్.. ట్విట్టర్.. యాపిల్.. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఛాలెంజింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ConversionConversion EmoticonEmoticon