CURRENT AFFAIRS ON 12-09-2016

1.పేటీఎంకు సరికొత్త వెరిఫికేషన్‌ వ్యవస్థ

దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్‌ మొబైల్‌ పేమెంట్‌ అండ్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ పేటీఎం కస్టమర్‌ వెరిఫికేషన్‌ ప్రాసెస్‌ను ఆధార్‌ ఆధారిత ఈకేవైసీతో అనుసంధానించింది. దీనిని ఉపయోగించడం వల్ల గుర్తింపుల చోరీ, ఆర్థిక నేరాలు, మనీ లాండరింగ్‌ వంటి వాటికి అడ్డుకట్ట వేయవచ్చు. దీంతో కాగిత రహితంగా, అప్పటికప్పుడు, భద్రంగా చెల్లింపులు చేయవచ్చు.
 బయోమెట్రిక్‌ స్కాన్‌ ఆధారంగా కస్టమర్ల వెరిఫికేషన్‌ అప్పటికప్పుడే నిర్వహించవచ్చు. సాధారణంగా బ్యాంకులు, వ్యాలెట్‌ ప్రొవైడర్లు ఇటువంటి వాటిని వినియోగిస్తారు. ఎవరైనా పేటీఎం వినియోగదారుడు తమ ఖాతాను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలంటే సమీపంలోని పేటీఎం సెంటర్‌కు వెళ్లడం కానీ లేదంటే వారు సూచించిన అడ్రస్‌కు వచ్చిన పేటీఎం ఏజెంట్‌ తో  కేవైసీ ప్రాసెస్‌ను వేగవంతం చెయ్యాలి.

2.రూ.100 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఇస్కాన్‌ ప్రాజెక్ట్‌


 చేతిలో వెన్నముద్దతోనున్న కృష్ణుని అరుదైన ప్రతిమ ప్రపంచంలోనే ఒక్క చెంఘీజ్‌ఖాన్‌పేటలోనే ఉందని ఇస్కాన్‌ సంస్థ గుర్తించింది. ఇక్కడ కృష్ణునికి స్వర్ణ దేవాలయం నిర్మించాలని సంకల్పించింది. వెన్నముద్ద వేణుగోపాలుడికి స్వర్ణ మందిరం నిర్మించాలనే కల నెరవేరే దిశగా అడుగులు ముందుకు కదులుతున్నాయి.
 ఏళ్ల క్రితమే గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం చెంఘీజ్‌ఖాన్‌ పేటలో స్వర్ణ దేవాలయ నిర్మాణానికి ఇస్కాన్‌ సంస్థ ముందుకొచ్చింది. ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.  ఉన్నత స్థాయిలో అధికారులు చర్చలు జరపడంతో ఎట్టకేలకు సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు చెంఘీజ్‌ఖాన్‌పేటలో స్వర్ణ మందిర నిర్మాణం పనులు సాగుతున్నాయి.తొమ్మిది నెలల్లో కన్నయ్య కోవెల నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని ఇస్కాన్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

3. తెలంగాణలో  కొలువుల జాతర

దశల వారీగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గిరిజన, గురుకుల విద్యాసంస్థల్లో పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. టీజీటీ 350, పీఈటీ 50, స్టాఫ్‌ నర్స్‌ 50 సహా ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేస్తారు.

4.యూఎస్‌ టైటిల్‌ స్విస్‌ స్టార్‌  స్టాన్‌ వావ్రింకా కైవసం

స్విస్‌ కెరటం స్టాన్‌ వావ్రింకా  తొలిసారి యూఎస్‌ ఓపెన్‌ విజేతగా అవతరించి రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ నెంబర్‌ వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ను మట్టికరిపించాడు.  6-4, 7-5, 6-3తో వరుస సెట్లలో విజయం సాధించి యూఎస్‌ ఓపెన్‌ రారాజుగా నిలిచాడు.
 1970లో కెన్‌ రోస్‌వాల్‌ (35), 2002లో పీట్‌ సంప్రాస్‌ తర్వాత పెద్ద వయసులో యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ సొంతం చేసుకున్న ఘనత వావ్రింకా (31)దే. ఆస్ట్రేలియా ఓపెన్‌ (2014), రొలాండ్‌ గారోస్‌ (2015) తర్వాత అతడికిది మూడో మేజర్‌ టైటిల్‌ కాగా జకోవిచ్‌ నాలుగోసారి యూఎస్‌ ఓపెన్‌ రన్నరప్‌గా నిలిచాడు.

5. మైనేనికి అత్యుత్తమ ర్యాంకు

 భారత టెన్నిస్‌ క్రీడాకారుడు సాకేత్‌ మైనేని తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో పురుషుల సింగిల్స్‌లో 143 నుంచి 137వ స్థానానికి ఎగబాకాడు. 28 ఏళ్ల మైనేని మూడు అర్హత మ్యాచుల్లో గెలుపొంది తొలిసారి యూఎస్‌ ఓపెన్‌ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించాడు.
  రామ్‌ కుమార్‌ రామనాథన్‌ ఒక స్థానం పడిపోయి 203కు చేరుకున్నాడు. యువ ఆటగాడు సుమిత్‌ నాగల్‌ 14 స్థానాలు ఎగబాకి 380వ ర్యాంకు దక్కించుకున్నాడు.ఇక డబ్ల్యూటీఏ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో సానియా మీర్జా 9,730 పాయింట్లతో ప్రపంచ నెంబర్‌ వన్‌గా కొనసాగుతోంది.
  ఆమె మాజీ భాగస్వామి స్విస్‌ తార మార్టినా హింగిస్‌ 9,725 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. పురుషుల డబుల్స్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు రోహన్‌ బోపన్న ఒక స్థానం దిగజారి 18, లియాండర్‌ పేస్‌ 63 స్థానాల్లో ఉన్నారు.

6.ప్రపంచ టాప్‌-5లో సాక్షి మలిక్‌

రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత మల్లయోధురాలు సాక్షి మలిక్‌ టాప్‌-5 రెజ్లర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ సమాఖ్య ప్రకటించిన ర్యాంకుల జాబితాలో 58 కిలోల విభాగంలో సాక్షి నాలుగో స్థానాన్ని సంపాదించింది. భారత చరిత్రలో తొలిసారి ఒలింపిక్‌ పతకం సాధించిన రెజ్లర్‌ సాక్షినే కావడం విశేషం.
  ఒలింపిక్స్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మరో మహిళా రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ 48 కిలోల విభాగంలో 11వ ర్యాంకు సాధించింది. ఇక పురుషుల విభాగంలో సందీప్‌ తోమర్‌, బజరంగ్‌ పూనియా టాప్‌ 20 మంది రెజ్లర్ల జాబితాలో ఉన్నారు.

7.బుర్జ్‌ ఖలీఫాలో 22 ఫ్లాట్లు భారతీయుడివే

భారత్ కు చెందిన ఓ వ్యాపారవేత్త జార్జ్ వీ నేరియా పరాంబిల్ దుబాయ్ లోని బుర్జ్ కలిఫాలో 22 ఫాట్ల ను కొనుగోలు చేసారు.కేరళలో జన్మించిన ఆయన ప్రస్తుతం దుబాయ్ లోని బుర్జ్ కలిఫాలో ఓ పెద్ద ప్రైవేట్ కంపెనీకి యజమానిగా వ్యవహరిస్తున్నారు.ఎడారి దేశంలో వేడి ఎక్కువగా ఉండటంతో 1976 లో ఎయిర్ కండిషనింగ్ బిజినెస్ ను ప్రారంభించారు.

8. పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. మహిళల షాట్‌పుట్‌ విభాగంలో దీపా మాలిక్‌రజత పతకం సాధించింది. సోమవారం జరిగిన ఫైనల్లో 4.61 మీటర్ల దూరం విసరడం ద్వారా ఆమె ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ ఘనతతో పారాలంపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా దీపా రికార్డు సృష్టించింది.
ఆమె 2012లో అర్జున అవార్డు అందుకంది.దీప పేరుపై లిమ్కా బుక్‌ రెండు రికార్డులు ఉన్నాయి. మొదటిది 2008లో యమునా నది ప్రవాహాన్ని కిలో మీటర్‌ దాటడం. రెండోది 2013లో ప్రత్యేక బైక్‌పై 58 కిలోమీటర్లు ప్రయాణించడం.బహ్రెన్‌కు చెందిన ఫతేమా నేధమ్‌ 4.76మీటర్లు విసిరి స్వర్ణం సాధించగా గ్రీస్‌కు చెందిన దిమిత్రా 4.28 మీటర్లతో కాంస్యం సాధించింది.

 భారత్‌కు ఇది పారాలింపిక్స్‌లో మూడో పతకం. ఇంతకు ముందు మరియప్పన్‌, వరుణ్‌ సింగ్‌ హైజంప్‌లో పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.


9. చిరస్మరణీయ "ముద్దు ఫోటో "నర్సు కన్నుమూత 

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిందన్న సంతోషం తో అమెరికా నావికాదళానికి చెందిన ఓ సైనికుడు పరిగెత్తుకుంటూ వచ్చి దారిలో కనిపించిన నర్సును ముద్దుపెట్టుకున్న ఫోటో 20వ శతాబ్దపు చిరస్మరణీయ ఫొటోలో ఒకటిగా నిలిచింది.ఆ ఫోటో లో కనిపించిన నర్సు గ్రేట ఫ్రెడిమాన్ ప్రస్తుతం 92 ఏండ్ల వయసులో మరణించారు.

Previous
Next Post »