CURRENT AFFAIRS 11-09-2016

1.9/11 మృతులకు మోదీ నివాళి

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ టవర్లపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నేటితో పదిహేనేళ్లు. ‘సెప్టెంబర్‌ 11వ తేదీ అంటే రెండు విభిన్నమైన ఘటనలు మదిలో మెదులుతున్నాయి. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రదాడి ఒకటైతే... 1893వ సంవత్సరంలో స్వామి వివేకానంద చికాగాలో చరిత్రాత్మకమైన ప్రసంగం చేసి ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న రోజు మరోటి’ అని మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా 9/11 మృతులకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు.

2.ఇక "సమరమే'' అన్న జార్జిబుష్ 

‘‘మనమిప్పుడు యుద్ధంలో ఉన్నాం. ఈ పని ఎవరు చేశారో మనకి తెలిసినప్పుడు.. అధ్యక్షుడిగా నా ప్రతాపం ఏమిటో తెలుస్తుంది. వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇదంతా ఎవరు చేశారో తెలుసుకునేందుకు నేను ఎదురు చూడలేను.’’ పదిహేనేళ్ల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌ చేసిన వ్యాఖ్యలివి.బుష్ ఆ రోజంతా అయన విమానంలోనే గడిపారు.ఆ రోజు బుష్ మాట్లాడిన ప్రతి మాటను వైట్ హౌస్  ప్రెస్ సెక్రటరీ ఆరి ఫ్లిషెర్ నోట్ చేసారు. న్యూయార్క్ ఘటన జరిగి పదిహేనేళ్ళు పూర్తయిన సందర్బంగా ఫ్లిషెర్ ఆ నోట్స్ నీ విడుదల చేయబోతున్నారు. ఆయన రాసిన వ్యాఖ్యల వివరాలు ఆరు పుటలున్నాయి.ఫ్లీశ్చర్‌ తాజాగా రాయిటర్స్‌ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ఆ రోజంతా తాను బుష్‌తోనే ఉన్నాననీ, ఆయనేం చెబుతారో విని, రాసుకోవడానికి ఎయిర్‌ఫోర్స్‌వన్‌ క్యాబిన్‌లోనే ఉండిపోయానని తెలిపారు.

3.ట్రంప్ ను ఓడించడానికి రెండు కోట్ల డాలర్లు 

అమెరికా అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు పోటీ పడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ ఓటమి కోసం ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 20 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.135 కోట్లు) విరాళం అందించాలని సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్ బుక్ సహా వ్యవస్థాపకుడు డస్టిన్ మాస్కోవిజ్ ప్రకటించారు.ట్రాంప్ గెలిస్తే అమెరికా అభివృద్ధి లో వెనకబడి ప్రపంచ దేశాల్లో ఏకాకిగా మారుతుంది అని "కంపేర్ టు యాక్ట్" అనే బ్లాగ్ లో పేర్కొన్నారు. అందుకే మొదటిసారిగా తాము డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు మద్దతు పలుకుతూ విరాళం ఇస్తున్నామన్నారు. మాస్కోవిజ్ భార్య కేరి ట్యూనా కూడా ఈ ప్రకటన పై సంతకం చేసారు.

4.  సిరియాలో కాల్పుల విరమణ

సిరియాలో కాల్పుల విరమణపై అమెరికా, రష్యాలు ఎట్టకేలకు ఒక ఒప్పందానికి వచ్చాయి.ఎన్నో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.  దేశంలో పేట్రేగిపోతున్న ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులపై అమెరికా, రష్యాల సంయుక్త పోరుకు మార్గం సుగమమైంది. ఈ ఒప్పందానికి సిరియా ప్రభుత్వం, విపక్షం అంగీకారం తెలిపాయి.

5. ఆధార్ కు విదేశాలు సైతం సై 

వేలిముద్రలు, కనుపాపలు ఆధారంగా మన దేశంలో దాదాపు 125 కోట్ల మందికి గుర్తింపునిచ్చేందుకు అమలు చేస్తున్న ఆధార్‌ విధానం పట్ల విదేశాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. ఆధార్‌ను ఎలా అమలు పరుస్తున్నారో తెలుసుకునేందుకు ‘భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ’ (ఉడాయ్‌) కార్యాలయానికి ప్రతినిధి బృందాలుగా వస్తున్నాయి. కీలకమైన సమాచారాన్ని బయటివారితో పంచుకోరాదని ఆధార్‌ చట్టంలో స్పష్టంగా ఉండడంతో దాని జోలికి పోకుండా, గుర్తింపు సంఖ్యల కేటాయింపు విధానం గురించి అధికార వర్గాలు ఆ బృందాలకు స్థూలంగా వివరించి చెబుతున్నాయి.

6. ఫ్లిప్‌కార్ట్‌లో బారి ఉద్యోగాలు 

ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తాత్కాలికంగా దాదాపు 10,000 మంది కొత్త ఉద్యోగులను భర్తీ చేసేందుకు సన్నధం అయింది. పండుగల సీజన్‌లో కస్టమర్లకు వేగంగా సేవలు అందించేందుకు కొత్త ఉద్యోగులను డెలివరీ, రవాణ సౌకర్యాల కోసం నియమించుకుంటోంది. వచ్చే సీజన్‌లో భారీగా ఆఫర్లు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ ఆడ్మిన్‌స్ట్రేటీవ్‌ ఆఫీసర్‌ నితిన్‌సేట్‌ మాట్లాడుతూ ‘‘ పండుగల సీజన్‌లో బిగ్‌బిలియన్‌ సేల్స్‌ గతం కంటే ఈ సారి మరింత భారీగా, విస్తృతంగా ఉండవచ్చు.. దీంతో పలు మార్గాల్లో మా డెలివరీ సామర్థ్యాలను పెంచుకుంటున్నాం. దీంతో దేశం చివరి భాగం వరకు మా రవాణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నాం’’ అన్నారు.

7. రియో పారాలింపిక్స్‌ లో ఒకేరోజు భారత్‌కు రెండు పతకాలు


రియో పారాలింపిక్స్‌ హైజంప్‌లో తమిళ తంబి మారియప్పన్‌ తంగవేల్‌ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో కాంస్యం కూడా భారత్‌ సొంతమైంది. అంచనాల ఒత్తిడి లేకుండా బరిలో దిగిన 21 ఏళ్ల మారియప్పన్‌ తంగవేలు పసిడితో చరిత్ర సృష్టించాడు. పారాలింపిక్స్‌ హైజంప్‌లో స్వర్ణం సాధించిన భారత తొలి ఆటగాడు మారియప్పన్‌. శనివారం ఫైనల్లో 1.89 మీటర్లు ఎత్తు ఎగిరిన తంగవేలు అగ్రస్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన వరుణ్‌ భాటి 1.86 మీటర్లతో ఒక దశలో రెండో స్థానంలో నిలిచాడు. ఐతే అంతే ఎత్తు ఎగిరిన సామ్‌ గ్రీవ్‌ (అమెరికా)కు రజతం దక్కింది. వరుణ్‌ కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకే విభాగంలో భారత్‌కు రెండు పతకాలు లభించడం ఇదే తొలిసారి.

8.అతి స్వచ్ఛ రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్

దేశపు అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా రికార్డు కెక్కింది హిమాచల్‌  ప్రదేశ్. స్వచ్ఛభారత్ అభియాన్ ఇటీవల దేశంలో అత్యంత పరిశుభ్రతగల ప్రాంతాల గురించి సర్వే నిర్వహిం చింది. సర్వేలో టాప్ -10 అత్యంత స్వచ్ఛ మైన ప్రాంతాల్లో ఐదు ఒక్క హిమా చల్ ప్రదేశ్ లోనే ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.   వ్యక్తిగత పరిశుభ్రత మా త్రమే పాటించడంతో సరిపు చ్చకుండా, నలుగురూ తిరిగే బహిరంగ ప్రదే శాలను కూడా స్వచ్చంగా ఉంచ డంలో హిమాచల్ వాసులు ముందున్నారు. దేశ విదేశాలకు చెందిన పర్యా టకుల తాకిడి సంవత్సరంలో అన్ని రో జులూ అధికంగా ఉండే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో స్వచ్చత పట్ల, వ్యక్తిగత పరిశుభ్రత పట్ల మంచి అవగా హనే ఉంది. 

9. గిన్నిస్ రికార్డులోకి తాపేశ్వరం లడ్డూ 


గణపతి నవరాత్రుల సందర్భంగా ఏపీ, తెలంగాణల్లోని పలు గణేష్ ప్రధాన మండపాలకు తాపేశ్వరంలోని స్వీట్ హౌజ్ అతిపెద్ద లడ్డూలను సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. ఈమేరకు ఈసారి అతిపెద్ద లడ్డూను తయారు చేసి రికార్డు సృష్టించింది. విశాఖపట్నంలోని 78 అడుగుల ఎత్తుగల గణేష్ విగ్రహానికి ఏకంగా 29.5 టన్నుల లడ్డూను తయారు చేసి గిన్నిస్ రికార్డుకెక్కింది.

10.యూఎస్‌ ఓపెన్‌లో కెర్బర్‌ సంచలనం

జర్మన్‌ స్టార్‌ ఏంజెలిక్‌ కెర్బర్‌ యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది. కరోలినా ప్లికోవాపై  6-3, 4-6, 6-4తో కెర్బర్‌ విజయం సాధించింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు వచ్చిన కరోలినా ప్లిస్కోవా వరుస తప్పిదాలతో తొలిసెట్‌ను కోల్పోయింది. ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌లో నెగ్గిన కెర్బర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్లో తొలిరౌండ్‌లోనే ఇంటి దారి పట్టింది. దీంతో ఆమె ఆటతీరుపై పెద్దగా అంచనాల్లేవు. అయినా మెరుగైన ఆటతీరుతో యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ కైవసం చేసుకుని అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది. కెర్బర్‌ కెరీర్‌లో ఇంది రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌.



Previous
Next Post »