1. సంపద లో బిల్‌గేట్స్‌ని దాటేసిన గుమస్తా
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాను తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యధిక ధనవంతుడైన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ను స్పెయిన్ వ్యాపారవేత్త దాటేసి ముందుకెళ్లారు. దీంతో ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకిఎక్కారు.ఫోర్బ్స్ ప్రకారం అమెన్సియో ఓర్టెగా ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. ఓర్టెగా తన కెరీర్‌ను ఓ స్టోర్ గుమస్తాగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన సొంతగా వ్యాపారం చేశారు. వంద డాలర్ల కంటే తక్కువ పెట్టుబడితో ఓర్టెగా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఓర్టెగా 2001లో 6.6బిలియన్ డాలర్లతో తొలిసారి ఫోర్బ్స్ జాబితాలోకి వచ్చారు. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సంపన్నుడి స్థాయికి చేరారు.79.5 బిలియన్ డాలర్ల సంపదతో ఓర్టెగా బిల్‌గేట్స్‌ను దాటేశారు. బిల్‌గేట్స్ సంపద 78.5బిలియన్ డాలర్లుగా ఉంది.
2. రెండో స్పేస్‌ల్యాబ్‌ను నింగిలోకి పంపనున్న చైనా
రెండో స్పేస్ ల్యాబ్ తియాంగాంగ్-2ను చైనా త్వరలో నింగిలోకి పంపించనుంది. మరికొద్ది రోజుల్లో ఈ స్పేస్‌ల్యాబ్‌ను కక్ష్యలోకి పంపించడానికి చైనా ప్రణాళిక సిద్ధం చేసింది. 2022 సంవత్సరానికి చైనా సొంతగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంలో భాగంగా ఈ స్పేస్‌ల్యాబ్‌లను చైనా ప్రవేశపెడుతోంది. సెప్టెంబరు 15 నుంచి 20 మధ్యలో తియాంగాంగ్-2ను కక్ష్యలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు దేశ అధికారిక షినువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
3. గూగూల్ సరికొత్త ఫీచర్
ప్రముఖ ఇంటర్నెట్ సెర్చింజన్ ‘గూగూల్’ మొబైల్ వినియోగదారులకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘రివ్యూ ఫ్రం ద వెబ్’ పేరిట ఈ ఫీచర్‌ను విడుదల చేసింది.ఒక ప్రదేశానికి సంబంధిన రివ్యూను యూజర్ అప్‌లోడ్ చేస్తే.. వేరే మొబైల్ నుంచి ఆ ప్రాంత సమాచారాన్ని మరో వినియోగదారుడు కోరినప్పుడు ఈ రివ్యూను అతడు కూడా చూసే వెసులుబాటు ఉంటుంది.ఈ ఫీచర్ వివిధ ప్రదేశాలు, టీవీ షోలు, రెస్టారెంట్లు, సినిమాలకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
4. బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్ద దావా
డెబిట్, క్రెడిట్ కార్డు సేవలు అందించే మాస్టర్‌కార్డ్‌పై బ్రిటన్‌కు చెందిన న్యాయ సంస్థ క్విన్ ఇమాన్యుయేల్ భారీ స్థాయిలో దావా వేసింది. ఖాతాదారులకు అందించే సేవలపై అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపిస్తూ, దాదాపు రూ.1.30 లక్షల కోట్లు (19 బిలియన్ డాలర్లు) చెల్లించాలని తాఖీదులు పంపింది. ఇప్పటి వరకు బ్రిటన్ చరిత్రలో ఇదే అతి పెద్ద దావా కావడం విశేషం. 1992-2007 మధ్య అందించిన సేవలపై మాస్టర్‌కార్డ్ చట్ట విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసినట్లు క్విన్ ఇమాన్యుయేల్‌కు చెందిన న్యాయవాది వాల్టర్ మెరిక్ వెల్లడించారు.

5. 5వ స్థానం లో బీఎస్‌ఎన్‌ఎల్
ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) ఎయిర్‌సెల్‌ను వెనక్కి నెట్టి మళ్లీ 5వ స్థానానికి ఎగబాకింది. జూన్‌లో సంస్థకు 13 లక్షల కొత్త కనెక్షన్లు జత కలిశాయి. దీనితో మొత్తం కనెక్షన్ల సంఖ్య 8.98 కోట్లకు పెరిగింది. 25.57 కోట్ల కనెక్షన్లతో ఎయిర్‌టెల్ అగ్రస్థానంలో నిలవగా.. వొడాఫోన్ (19.93 కోట్లు), ఐడియా (17.62 కోట్లు) ఆ తరువాత స్థానాల్లో నిలిచాయి. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య కూడా 15.97 కోట్ల నుంచి 15.98 కోట్లకు పెరిగినట్లు ట్రాయ్ పేర్కొంది.
రియో పారా ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. హైజంప్ విభాగంలో మరియప్ప బంగారు, వరుణ్‌సింగ్ భాటి కాంస్య పతకాలు సాధించారు.
7. అయ్యో.. సెరెనా
ప్రపంచ నెం.1 సెరెనా విలియమ్స్ కథ ముగిసింది. స్టెఫీగ్రాఫ్ 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును బద్దలుకొట్టాలనుకున్న ఈ అమెరికా తార కలను చెక్ అమ్మాయి కరోలిన ప్లిస్‌కోవా భగ్నం చేసింది. ఈ పరాజయంతో సుదీర్ఘ విరామం తర్వాత సెరెనా నెం.1 ర్యాంకును కూడా చేజార్చుకుంది. మరోవైపు డచ్ భామ వోజ్నియాకి జోరుకు తెరదించిన రెండోసీడ్ కెర్బర్ (జర్మనీ).. ప్లిస్‌కోవాతో టైటిల్ పోరుకు సిద్ధమైంది. అంతేకాదు నెంబర్‌వన్ ర్యాంకును కూడా సొంతం చేసుకుంది.
8.మూసి ఉన్న పుస్తకాన్ని చదివిన రోబో
మూసి ఉన్న పుస్తకాన్ని చదివే రోబోను అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ రోబో తయారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉందని, పుస్తకంలోని తొమ్మిది ప్రారంభ పేజీల్లో ఉన్న సమాచారాన్ని రోబో గుర్తిస్తున్నదని ఎంఐటీ ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రాసెసర్‌కు ఇమేజింగ్ సిస్టంను అనుసంధానం చేయడం ద్వారా ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ రోబోపై న్యూయార్క్‌కు చెందిన మెట్రోపాలిటన్ మ్యూజియం అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నది. ఆ మ్యూజియంలో ముట్టుకోవడానికి అవకాశం లేని అతి ప్రాచీన పుస్తకాలను చదివేందుకు ఉపయోగించుకోనున్నది అని ఎంఐటీ శాస్త్రవేత్త బార్మక్ హెష్మత్ తెలిపారు.
9.పదేళ్ల బాలికకు "నీతిఆయోగ్" అవార్డు
మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన 10 ఏండ్ల అమ్మాయిని 'ఉమెన్ ట్రాంఫార్మింగ్ ఇండియా'అవార్డు వరించింది.రియో కాంస్య పతాక విజేత సాక్షి మాలిక్ ఈ అవార్డు అందజేశారు. పిల్లలో చదువు పై ఆసక్తి కలిగించడానికి ముస్కాన్ హేయిర్ వార్ అనే అమ్మాయి భోపాల్ లోని దుర్గానగర్ మురికివాడలో ఓ గ్రంధాలయాన్ని నడుపుతుంది.ఇంత చిన్నవయస్సులో ఇలాంటి ఆలోచన చేసినందుకుగాను అవార్డు వరించింది. ఈ అవార్డు నీతిఆయోగ్ ప్రకటించింది.

ConversionConversion EmoticonEmoticon