1. నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి గురువారం సాయంత్రం 4.10 గంటలకు జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్-ఎఫ్05 (జీఎస్‌ఎల్‌వీ) నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్‌డౌన్ ప్రక్రియ బుధవారం ఉ.11.10గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 29 గంటలపాటు కొనసాగిన అనంతరం జీఎస్‌ఎల్‌వీ నింగిలోకివెళ్లనుంది.దీని ద్వారా వాతావరణ అధ్యయనానికి సంబంధించి ఇన్సాట్-3డిఆర్ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. పైకెగసిన 17 నిమిషాల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది.దీని ద్వారా వాతావరణ అధ్యయనానికి సంబంధించి ఇన్సాట్-3డిఆర్ ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. పైకెగసిన 17 నిమిషాల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది.
2.నేతాజీ కారుకు మరమ్మతులు
నేతాజీ సుభాష్‌చంద్రబోస్ అలనాడు వాడిన కారును ఇప్పుడు మరమ్మతులు చేసి పునరుద్ధరిస్తున్నారు.1941లో గృహనిర్బంధంలో ఉన్న నేతాజీ కోల్‌కతా నుంచి తప్పించుకునేఅందుకు ఉపయోగించిన ''గ్రేట్ ఎస్కేప్ "కారు ఇది.ఇక్కడి నేతాజీ పూర్వీకుల నివాస ప్రాంగణంలో పార్క్‌చేసి ఉంచిన ఈ కారును నడిపేందుకు వీలుగా మరమ్మతులు చేసే బాధ్యతను ప్రముఖ జర్మనీ కార్ల కంపెనీ ‘ఆడి’ చేపట్టింది.ఈ విషయన్ని నేతాజీ బ్యూరో అధికారులు తెలిపారు.
3. భూమికి తిరిగొచ్చిన వ్యోమగాములు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఆర్నెళ్లపాటు గడిపిన ముగ్గురు వ్యోమగాములు భూమికి బుధవారం సురక్షితంగా తిరిగొచ్చారు. అమెరికా వ్యోమగామి(ఆస్ట్రోనాట్) జెఫ్ విలియమ్స్, రష్యా వ్యోమగాములు(కాస్ట్రోనాట్‌లు) అలెక్సీ ఒవ్చినిన్, ఒలెగ్ స్క్రిపోచ్కా కజఖ్‌స్థాన్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:13కు భూమిపై దిగారు. విలియమ్స్(58).. అంతరిక్షంలో ఎక్కువకాలం గడిపిన అమెరికా వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. నాలుగు యాత్రల్లో కలిపి మొత్తం 534 రోజులపాటు అంతరిక్షంలో గడిపారు. అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన రికార్డు మాత్రం రష్యాకు చెందిన గెన్నడీ పడల్కా(879 రోజులు) పేరు మీద ఉంది.
4. భారత్‌కు అమెరికా డ్రోన్లు
అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నిరాయుధ డ్రోన్లను అమెరికా భారత్‌కు విక్రయించనుంది. గత జూన్‌లో అమెరికా కీలక రక్షణ భాగస్వామి హోదాను భారత్‌కు కల్పించిన నేపథ్యంలోఈ మేరకు నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది.హిందూ మహాసముద్రంలో నిఘా కోసం 22 ప్రిడేటర్ గార్డియన్ డ్రోన్లు అమ్మాలంటూ భారత్ చేసిన వినతిపై అగ్రరాజ్యం సానుకూలంగా స్పందించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నారు. ప్రిడేటర్ గార్డియన్ యూఏవీలు హిందూమహా సముద్రంలో భారత సముద్ర నిఘా సామర్థ్యాన్ని పెంచుతాయని అధికారులు భావిస్తున్నారు.బరాక్ ఒబామా వచ్చే ఏడాది జనవరితో అధ్యక్ష పదవి నుంచి దిగిపోయేలోపే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గార్డియన్ యూఏవీలను జనరల్ అటామిక్స్ సంస్థ అత్యున్నతస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించింది.
5. ఐఫోన్ 7 వచ్చేసింది
2016 సంవత్సరపు సూపర్ ఫోన్ గా "ఐఫోన్ 7" రంగప్రవేశం చేసింది. బిల్ గ్రాహం సివిక్ ఆడిటోరియం లో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఐఫోన్ 7 విడుదల చేసారు. ఐఫోన్ 7 రెండు రకాలుగా లభ్యం కానుంది. 4.7 అంగుళాలతో ఐఫోన్ 7, 5.5 అంగుళాలతో ఐఫోన్ 7 ప్లస్ మార్కెట్లో సందడి చేయనున్నాయి. ఈ నెల 9 నుండి ఐఫోన్ 7 అమ్మకాలకు ముందస్తు బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు ,16 నుండి 12 దేశాల మార్కెట్లో ఈ ఫోన్ లభించనున్నాట్లు ప్రకటించారు. ఈ ఫోన్ ధరను సుమారుగా రూ. 43,100 గా నిర్ణయించారు.
ఐఫోన్ తో పాటు ఆపిల్ వాచ్ కొత్త సిరీస్ 2 ను కూడా విడుదల చేసారు.

6. కేరళ జెర్సీలో సచిన్,నాగ్,చిరు
మూడో సీజన్ ఇండియన్ సూపర్ లీగ్ కోసం కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ జట్టు జెర్సీని ఫ్రాంచైజీ యజమాని సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫ్రాంచైజీ సహా యజమానులు చిరంజీవి,నాగార్జున,అల్లు అరవింద్ కూడా పాల్గున్నారు. వీళ్లంతా కేరళ సంప్రదాయ శైలి అయినా పంచె కట్టులో సందడి చేస్తూ ఆటగాళ్లను ఉత్సహపరిచారు. సచిన్ టీం ఆటగాళ్లను పరిచయం చేసారు.కేరళ బ్లాస్టర్స్ జట్టు కోచ్ గా మాంచెస్టర్ యూనైటడ్ వెటరన్ ఆటగాడు స్టీఫెన్ కోపెల్ ను తీసుకున్నారు.
ConversionConversion EmoticonEmoticon