CURRENT AFFAIRS ON 21-10-2016

1. ఒలింపిక్‌ అథ్లెట్స్‌ కమిషన్‌లో సైనానెహ్వాల్‌

భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐఓసీ) అథ్లెట్స్‌ కమిషన్‌లో సభ్యురాలిగా సైనా నెహ్వాల్‌ను నియమించారు.ఏంజెలా రుగీరో అధ్యక్షతన ఏర్పాటైన ఈ అథ్లెట్స్‌ కమిషన్‌లో 9 మంది ఉపాధ్యక్షులు, 10 మంది సభ్యులుంటారు. నవంబర్‌ 6న కమిషన్‌ సమావేశం జరగనుంది.మోకాలి శస్త్రచికిత్స నుంచి ఇటీవలే కోలుకున్న సైనా నెహ్వాల్‌.. మళ్లీ ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది.

2.సన్నీకి జీవిత సాఫల్య పురస్కారం

క్రికెట్ లెజెండ్ సునీల్ మనోహర్ గవాస్కర్ కి  జీవిత సాఫల్య పురస్కారం అందించనున్నట్లు ముంబై జర్నలిస్టు క్రీడల సంఘం(ఎస్ జేఏఎమ్) ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 11న ఎస్ జేఏఎమ్ గోల్డెన్ జూబ్లీ వేడుకల పురస్కారానికి సునీల్ ను ఎంపిక చేసినట్లు తెలిపింది.గవాస్కర్ కు భారత క్రికెట్ తో 50ఏళ్ల అనుబంధం ఉంది. టెస్టు క్రికెట్ లో 10వేల పరుగుల క్లబ్ లో చేరిన తొలి క్రికెటర్ సునీల్ గవాస్కర్.983 వరల్డ్ కప్ సాధించిన టీమ్ లో సన్నీ కూడా ఉన్నారు. కెరీర్ లో 125 టెస్టు మ్యాచ్ లు ఆడిన సన్నీ 34 సెంచరీలతో 10,122 పరుగులు చేశారు. 108 వన్డే మ్యాచ్ ల్లో 3 వేల పరుగులు సాధించారు. అప్పటినుంచి బీసీసీఐ టెక్నికల్ కమిటీ, ఐసీసీ క్రికెట్ కమిటీలకు చైర్మన్ గాను, ఐసీసీ మ్యాచ్ రిఫరీగాను, ముంబై క్రికెట్ సంఘానికి చైర్మన్ గాను, క్రికెట్ ఇంప్రూవ్ మెంట్ కమిటీలోనూ, భారత క్రికెట్ టీమ్ కు బ్యాటింగ్ కోచ్ గాను సేవలందించారు. 2014లో భారత్, యూఏఈల్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లకు బీసీసీఐ ప్రెసిడెంట్ గా సుప్రీంకోర్టు సన్నీని నామినేట్ చేసింది.

Previous
Next Post »