CURRENT AFFAIRS ON 17-10-2016

1.అంతరిక్ష ప్రయోగం చేసిన చైనా

చైనా చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ మానవసహిత అంతరిక్ష యాత్ర సోమవారం విజయవంతంగా ప్రారంభమైంది.జియుక్వాన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ వ్యోమనౌకను ప్రయోగించారు.ఈ నౌకలో జింగ్‌ హైపెంగ్‌.. షెన్‌ డాంగ్‌ అనే ఇద్దరు వ్యోమగాములు కక్ష్యలోకి పయనమయ్యారు.లాంగ్‌ మార్చ్‌ 2ఎఫ్‌ అనే రాకెట్‌ ద్వారా ఈ వ్యోమనౌక నిర్ణీత క్షక్ష్యలోకి ప్రవేశించింది.

2.సైనాకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం

భారత బాడ్మింటన్ నెంబర్ 1 సైనా నెహ్వాల్ ను చెన్నైకి చెందిన ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. ఎస్ఆర్ఎమ్ 12వ స్నాతకోత్సవం లో వర్సిటీ ఛాన్సలర్ సత్యనారాయణ డాక్టర్ అఫ్ లిటరేచర్ డిగ్రీ ని సైనా కు అందజేశారు. 

3. షాంఘై కింగ్ ముర్రే 

బ్రిటన్ టెన్నిస్ హీరో ఆండీ ముర్రే షాంఘై మాస్టర్స్ టైటిల్ గెలిచాడు. ప్రపంచం లో రెండో ర్యాంకర్ ముర్రే రోబర్టా బటిస్టా ను ఓడించి విజేత గ నిలిచాడు . ఈ సీజన్ లో ముర్రేకిది రెండో ఏటీపీ వరల్డ్ టూర్ మాస్టర్స్ టైటిల్ కాగా,ఓవరాల్ గా 13ది. 
Previous
Next Post »