1.చికున్‌గున్యా జన్యురూపం తెలిసింది
దేశన్ని వణికిస్తున్న చికున్ గున్యా వైరస్ జన్యురూపాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు గుర్తించారు. 2006లో విజృంభించిన ఈస్ట్ సెంట్రల్ సౌత్ ఆఫ్రికన్ వైరస్సే ఇప్పుడూ పీడిస్తోందని తేల్చారు.
ఈ సీజన్‌లో ఢిల్లీలో ఇప్పటిదాకా 3,700 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. వైరస్‌ను గుర్తించి, నివేదికను జాతీయ సంక్రమిత వ్యాధుల నియంత్రణ పథకం వారికి పంపామని వైద్యులు తెలిపారు. ఈ వైరస్ ఆసియన్, వెస్ట్ ఆఫ్రికన్, ఈస్ట్ సెంట్రల్ సౌత్ ఆఫ్రికన్ అని మూడు జన్యురూపాల్లో ఉంటుంది.

2. ట్విట్టర్ కొనుగోలు రేసులో మరో దిగ్గజం
మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. అయితే ట్విట్టర్ ను సొంతం చేసుకోవడానికి ప్రముఖ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే గూగుల్ మరియు సేల్స్ ఫోర్స్ త్వరలోనే బీడ్ చేయనున్నాయి అన్న విషయం విదితమే.ఈ రేస్ లో మరో ప్రముఖ కంపెనీ చేరింది.ట్విట్టర్ కొనుగోలుకు టెక్ దిగ్గజంతో పోటీ పడటానికి వాల్ట్ డిస్నీ కంపెనీ ముందుకొచ్చింది. ట్విట్టర్ ను డిస్నీ కంపెనీ సొంతం చేసుకుంటే ఆ కంపెనీకి ఇదే అతిపెద్ద టెక్నాలజీ డీల్ గా తెలుస్తోంది.విజయవంతంగా ట్విట్టర్ ను డిస్నీ సొంతం చేసుకుంటే, ఈఎస్ పీఎన్ చానల్ సేవలను మరింత విస్తరించడానికి డిస్నీకి ఈ టెక్నాలజీ సంస్థ ఓ సాధనంగా ఉపయోగపడుతుందని వాల్ స్ట్రీట్ రిపోర్టు పేర్కొంది.
3. హ్యాపీ బర్త్ డే టూ గూగుల్
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కు సెప్టెంబర్ 27వ తేదీ చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు గూగుల్ కంపెనీ 18వ బర్త్ డే. 1998 సెప్టెంబర్ లో లారీ పేజ్, సెర్జీ బ్రిన్.. గూగుల్ ను స్థాపించారు. అయితే గూగుల్ ను ఏ తేదీన స్థాపించారు అని వారికే గుర్తులేదు. మొదట్లో సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 8న బర్త్ డే చేసుకున్నారు. గూగుల్ హిస్టరీ లిస్ట్ లో వ్యవస్థాపకం దినం సెప్టెంబర్ 4 అని ఉంది. 2006 నుంచి మాత్రం సెప్టెంబర్ 27వ తేదీన బర్త్ డే నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించింది.ఈ సందర్భంగా గూగుల్ హోం పేజీలో ప్రత్యేక డ్యూడుల్ దర్శనమిచ్చింది.గూగుల్ మనకు ఎంత హెల్ప్ చేస్తుందో మన అందరికి తెలిసిందే అందుకే ఈ రోజు గూగుల్ కి బర్త్ డే విషెస్ చెప్పేదాం.
4.శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు కు హెచ్ సీయూ ప్రొఫెసర్
సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం లో యూనివర్సిటీ ల అధ్యాపకులకు అందించే శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు కు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎంపికయ్యారు. స్కూల్ అఫ్ లైఫ్ సైన్స్ లో బయోటెక్నాలజీ అండ్ బయోమెట్రిక్స్ డిపార్టుమెంటు హెడ్ డాక్టర్ నియాజ్ అహ్మద్ కు దక్కింది.డాక్టర్ నియాజ్ జన్యు ప్రేరణ సంక్రమిక రోగ విజ్ఞానం,బాక్టీరియా విరులెన్సు యంత్రాల ద్వారా ఎంట్రో వ్యాధికారక బాక్టీరియా,మైక్రో బాక్టీరియా,క్షయ వ్యాధికార ఫంక్షనల్ సంక్రమిక రోగ విజ్ఞానంలో చేసిన రచనలకు గాను అవార్డు ప్రకటించారు.
5. రాష్ట్రంలోని 5 పట్టణాలకు స్వచ్చ పురస్కారాలు
ఈ నెల 25 నుండి అక్టోబరు 2 వరకు న్యూఢిల్లీ లో జరిగే "స్వచ్చ్ భారత్ వీక్ "లో భాగంగా రాష్ట్రానికి చెందిన 5 పట్టణాలకు క్యూసీఐ అవార్డు లను అందిస్తున్నట్లు స్వచ్ భారత్ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ రాష్ట్ర పురపాలక శాఖకు సమాచారం అందించారు . తెలంగాణ లోని షాద్ నగర్ ,సిద్దిపేట ,అచ్చంపేట ,సూర్యాపేట హుజుర్ నగర్ పట్టణాలు ఓడీఫ్ లుగా నమోదు అయ్యాయి. ఈ నగరాలకు ఢిల్లీ లో జరిగే కార్యక్రమం లో స్వచ్ఛతా పురస్కారాలను అందజేయనున్నారు.
6."గోల్ఫ్ కింగ్" ఇకలేరు
అమెరికాకు చెందిన గోల్ఫ్ దిగ్గజం ఆర్నాల్డ్ డానియెల్ పాల్మార్ కన్నుమూశారు.గుండె సంభందిత సమస్య తో భాదపడుతున్న 87 ఏళ్ళ ఆర్నాల్డ్ పెట్స్ బర్గ్ లోని యూపీ ఎమ్ సి ప్రేస్బెటేరియన్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. 1924 లో జన్మించిన ఆర్నాల్డ్ 1954 లో ప్రొఫెషనల్ ఆటగాడిగా మారారు. 1955 లో కెనడియన్ ఓపెన్ తో విజయ ప్రస్థానాన్ని ఆరంభించిన ఆర్నాల్డ్ మరో మూడు ఏళ్ళ కు తొలి మేజర్ టైటిల్ నెగ్గడు. ఆర్నాల్డ్ ఆ తర్వాత వరుస విజయాలతో "ది కింగ్ అఫ్ గోల్ఫ్"గ మారారు. 1960 దశకం లో "దశాబ్దపు అథ్లెట్ "గా మన్ననలు అందుకున్న ఆర్నాల్డ్ తన కెరీర్ లో ఓవరాల్ గా 90 కు పైగా టోర్నీ లు గెలిచాడు.ఇందులో ఏడు మేజర్ టోర్నీలున్నాయి. గోల్ఫ్ కు ఆదరణను తీసుకురావడం లో అగ్రగణ్యునిగా ఆర్నాల్డ్ నిలిచారు.

ConversionConversion EmoticonEmoticon